ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Sun, Oct 23 2022 11:29 AM

CM YS Jagan Congratulates ISRO Scientists For Success Of LVM3 M2 - Sakshi

సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్‌వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా

Advertisement
 
Advertisement
 
Advertisement