ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సీఎం వైఎస్ జగన్‌ | Cm Jagan Mohan Reddy Thanked PM Modi | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌పై సందిగ్ధత తొలగించారని ప్రశంసలు

Jun 7 2021 10:20 PM | Updated on Jun 7 2021 10:39 PM

Cm Jagan Mohan Reddy Thanked PM Modi - Sakshi

సాక్షి, అమరావతి: వ్యాక్సిన్‌ కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని మోదీ తెలపడంపై సీఎం జగన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో వ్యాక్సిన్లపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని సీఎం పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటంలో మన చేతిలో ఉన్న ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్‌ అని అన్నారు. ఇంతకాలం వ్యాక్సిన్లపై ఉన్న సందిగ్ధతను తొలగించారు.. టీకా కార్యక్రమాన్ని జాతీయ ఎజెండాగా భావించి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement