వీఆర్వో సూసైడ్‌ నోట్‌ కలకలం

Chittoor VRO Writes Suicide Note That MPDO Is Torturing - Sakshi

సాక్షి, చిత్తూరు : ఎంపీడీఓ టార్చర్‌ పెడుతున్నారంటూ ఓ వీఆర్వో సూసైడ్‌ నోట్‌ రాసి కనిపించకుండా పోయారు. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మం‍డలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని 49కొత్తపల్లి వీఆర్వోగా పనిచేస్తున్న కోదండ రామిరెడ్డి మంగళవారం సూసైడ్‌ నోట్‌ రాని కనిపించకుండా పోయాడు. తన సొంత మండలంలో జాయిన్‌ చేయించుకోవడానికి ఎంపీడీవో నిరాకరిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోబుతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది రామిరెడ్డి నారాయణవనం మండలంకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.

అయితే గత నెలలో ఆయన డిప్యుటేషన్‌ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్‌ ఎత్తేశారు. దీంతో సొంతమండలానికి వెళ్లాలని రామిరెడ్డి భావించారు. కానీ సొంత మండలంలో జాయిన్‌ చేయించుకోవడానికి ఎంపీడీఓ నిరాకరించినట్లు రామిరెడ్డి ఆరోపించారు. ఎంపీడీవో అక్రమాలకు తాను సహరించకపోవడంతో తనపై కక్ష కట్టారని సూసైడ్‌ నోట్‌లో తెలిపారు. ఎంపీడీఓ చర్యలకు విరక్తి చెంది తనువు చాలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోదండరామిరెడ్డి కనిపించకుండా పోయారు. అతని ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top