Chairman K Ram Mohan Rao: Port plays key role in Visakhapatnam Development - Sakshi
Sakshi News home page

విశాఖ అభివృద్ధిలో పోర్టుదే కీలక పాత్ర: చైర్మన్‌ కె రామ్మోహనరావు

Published Sat, Mar 4 2023 10:42 AM

Chairman Said Port Is key Player In Visakhapatnam Development - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు(జీఐఎస్‌) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ సందర్భంగా సాక్షి టీవితో విశాఖ పోర్టు చైర్మన్‌ కే రామ్మోహన్‌రావు కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం. ఏపీలో సహజ వనరుల తోపాటు తగినంతలో మానవ వనరులు కూడా ఉన్నాయి. సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంత ఏపీ సొంతం. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు(జీఐఎస్‌)కి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కావడం ఎంతో శుభపరిణామం.

ఏపీ ప్రభుత్వ విధానాల వల్లే లక్షల కోట్ల రూపాయాలు పెట్లుబడుల వచ్చాయాని సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో మౌలిక సదుపాయాలు, రహదారులు, పోర్టులు అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతేగాదు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర. ఈ విశాఖ పోర్టు ఏర్పాటై సుమారు 90 ఏళ్లు అయ్యింది. ఈ పోర్టు ద్వారా రికార్డు స్థాయిలో 77 మిలియన్ల టన్నుల సరుకు రవాణ అయ్యింది. అంతేగాదు పెట్టుబడులకు విశాఖ నగరం అన్ని విధాల అనువైన నగరమే గాక ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ పోర్టు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ జరగబోతుంది. "అని చెప్పుకొచ్చారు.  

(చదవండి: ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో: సీఎం జగన్‌)

Advertisement
Advertisement