
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్రం ఈ విధంగా బదులిచ్చింది. రాజ్యసభ జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పూర్తి రిజర్వాయర్ ఎత్తు 45.72 మీటర్లు అని పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు