కరోనా వేళా ఏపీలో వృద్ధి 

Center Says GSDP Growth Rate Increased In AP During Covid Time - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేయడంవల్లే దేశంలో మిగి­లిన రాష్ట్రాల కంటే ఏపీలో జీఎస్‌డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌–రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి రేటు నమోదవుతోందని కేంద్రం నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన వివ­రాల్లో.. కరోనా లాంటి విపత్తు సమయంలో దేశ­వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు మైనస్‌ స్థాయికి పడిపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ సహా కేవలం 3 రాష్ట్రాల్లోనే వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడించింది. దీని ప్రకారం.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏపీ(0.08%), తమిళనాడు (0.14%), పశ్చిమ బెంగాల్‌ (1.06 %) మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ వృద్ధిరేటు మైనస్‌ స్థాయికి పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది. 

ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలవల్లే..
మరోవైపు.. ఆ ఆర్థిక సంవత్సరంలో ఏపీ మినహా మిగిలిన రెండు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమి­ళనాడులలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమ­నా­ర్హం. ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వాలు పెద్ద­ఎత్తున ప్రజాకర్షక పథకాలు అమలుచేయడం సహ­జం. తమిళ­నాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్ని­కల కారణంగా అక్కడి ప్రభుత్వాలు అమలు­చేసిన సంక్షేమ కార్యక్రమాలతో ఆయా రాష్ట్రాల్లో వృద్ధిరేటు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అప్పటికి 9 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల ప్ర­క్రియ పూర్తయింది.

ఇక మన రాష్ట్రంలో ప్రభు­త్వం పేద­లకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమ­లు­చేస్తుండడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడు­తున్నప్ప­టికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభు­త్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాల పథకా­లను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దీని­వల్లే ఆ ఏడాది రాష్ట్రంలో వృద్ధిరేటు సాధ్యమైందని అ«ధికార వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఇక ఆ ఏడాది దేశంలో ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరా­లున్న మహా­రాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వృద్ధిరేటు మైనస్‌ స్థాయిలోనే ఉంది. 

2021–22లో ఏపీనే టాప్‌..
కరోనా అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో అయితే ఏపీ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసినట్లు పార్లమెంట్‌లో తెలిపిన వివరాల్లో కేంద్రం పేర్కొంది. ఆ ఏడాది దేశంలోనే అత్యధికంగా ఏపీ 11.43% జీఎస్‌డీపీ వృద్ధిరేటును నమోదు చేసినట్లు వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ కంటే ఏపీ మెరుగైన వృద్ధిరేటు నమోదుచేసిందని కేంద్రం తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top