టీటీడీ ఛైర్మన్‌ ఆఫర్‌.. అందుకే నకిలీ రిపోర్టు .. భూమన కరుణాకర్ రెడ్డి | YSRCP Bhumana Karunakar Reddy Comments On Single Member Report Over Tirupati Laddu Issue, Targets TTD Inquiry Panel | Sakshi
Sakshi News home page

టీటీడీ ఛైర్మన్‌ ఆఫర్‌.. అందుకే నకిలీ రిపోర్టు .. భూమన కరుణాకర్ రెడ్డి

May 3 2026 4:45 PM | Updated on May 3 2026 5:31 PM

Bhumana Comments on Single Member Report

సాక్షి, తిరుపతి: లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ తేల్చిందని వైఎస్సార్సీపిీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  తిరుపతిలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్‌గా మారిపోయిందని చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కంటే ముందే ఈ నివేదిక ఎల్లో మీడియాకు చేరిందన్నారు.  

దినేష్‌ కుమార్‌ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా దినేశ్‌ కుమార్ నివేదిక ఇచ్చారని తెలిపారు. రిపోర్టులో కక్ష‍ పూరితంగానే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులని చెప్పారన్నారు. దినేష్ కుమార్ అనే అధికారి పచ్చి అవినీతి అధికారిగా ముద్రపడిన వ్యక్తి అటువంటి వారికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఇలా రిపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు.

సీబీఐ సిట్‌లో తమని దోషులుగా నిర్ధారించలేదని అందుకే చంద్రబాబు నాయుడు పన్నాగం పన్ని ఎలాగైనా తమను దోషులుగా నిలబెట్టాలనే ఈ కమిషన్‌ని నియమించారని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో సరైన విచారణ లేకుండా ఏకపక్ష నివేదిక ఇచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు అని చెప్పిన మిగతా వారిని మాత్రం ఎటువంటి విచారణకు పిలవలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement