ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్‌ | ASI Blackmail Love Couples Incident In Palnadu District | Sakshi
Sakshi News home page

ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్‌

Apr 11 2026 8:49 AM | Updated on Apr 11 2026 10:19 AM

ASI Blackmail Love Couples Incident In Palnadu District

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో సంచలన ఘటన బయటపడింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఏఎస్ఐ అకృత్యాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి తర్వాత బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఆ వీడియోలను చూపిస్తూ యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారం తీసుకుని వీడియోలు తీయిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు  ఉన్నాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement