
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై కూడా సర్కార్ ఓవరాక్షన్ చేస్తోంది. పలుచోట్ల వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగారు.
వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూడా కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రేణిగుంటలో శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి.. ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని సీఐ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌కు దిగారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో, ఈఘటనపై మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.