
సాక్షి,వియవాడ: ‘విజయవాడ ఉత్సవ్’ స్థలవివాదంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాలకు దేవాదాయ భూమి ఇవ్వొద్దని సూచించింది.
గొల్లపూడిలోని 40 ఎకరాల ఆలయ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయ భూమిని వాణిజ్యంగా ఎలా ఉపయోగిస్తారంటూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
గొల్లపూడిలో దేవాదాయశాఖ భూమిని వినియోగించొద్దని, గోల్ఫ్ కోర్సుకు ఐదెకరాల కేటాయింపు ప్రతిపాదన పై స్టే విధించింది. దీంతోపాటు తాత్కాలిక ఉత్సవాలు కేటాయింపు పైనా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ భూములను యధాతధంగా ఉంచాలని హైకోర్టు వెల్లడించించింది.