Andhra Pradesh: 28న శాసనసభ ప్రత్యేక సమావేశం | Andhra Pradesh State Cabinet meeting On 26th March 2026 | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 28న శాసనసభ ప్రత్యేక సమావేశం

Mar 26 2026 3:20 AM | Updated on Mar 26 2026 3:33 AM

Andhra Pradesh State Cabinet meeting On 26th March 2026

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేరుతో బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. 28వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దానిని కేంద్రానికి పంపించి.. పార్లమెంట్‌ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిసింది. 

అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే.. దానిపై తప్పనిసరిగా కేంద్రం స్పందిస్తుందనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో మాత్రమే తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మండలిలో వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉండడం.. ఆ పార్టీ సభ్యులు రాజధాని రైతుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరచి.. తీర్మానం చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.  

నేడు కేబినెట్‌ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement