టీడీపీ నేత కుటుంబానికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం 

Andhra Pradesh Govt assistance of Rs 5 lakh to TDP leader family - Sakshi

చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ భరత్‌ 

శాంతిపురం: చిత్తూరు జిల్లా చెంగుబళ్ల పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, గతంలో జన్మభూమి కమిటీ సభ్యుడిగా ఉన్న మునిసిబ్‌ గారి ప్రసాద్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసింది. చెంగుబళ్ల పంచాయతీ పరిధిలోని సోగడబళ్లలో ఆదివారం ఎమ్మెల్సీ భరత్‌ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ప్రసాద్‌ కుమారుడు మోహన్‌కు ఎమ్మెల్సీ భరత్‌ అందజేశారు. ప్రసాద్‌ భార్య రూప తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆమె వైద్యానికి అయిన ఖర్చులను ప్రభుత్వం మంజూరు చేసిందని భరత్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top