
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (పాత చిత్రం)
సాక్షి, కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పైలెట్ అప్రమత్తతతో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లోకి పక్షి దూసుకెళ్లింది. దీంతో విమానాన్ని వెంటనే పైలెట్ ఆప్రాన్(పార్కింగ్ ఏరియా లాంటిది)పైకి తరలించి నిలిపివేశారు.
గురువారం ఉదయం 8.25గం. ప్రాంతంలో గన్నవరం నుంచి బెంగళూరుకు ఎయిరిండియా విమానం వెళ్లాల్సి ఉంది. అయితే విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఇంజిన్‌లోకి దూరడాన్ని పైలెట్ గమనించి వెంటే నిలిపివేశారు. ఘటన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ లాంజ్‌కు తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన తర్వాతే ప్రయాణం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.