పొలానికి బలం! కేటాయింపుల్లో అన్నదాతకు అగ్రతాంబూలం | Sakshi
Sakshi News home page

పొలానికి బలం! కేటాయింపుల్లో అన్నదాతకు అగ్రతాంబూలం

Published Fri, Mar 17 2023 4:37 AM

41,436.29 crores for agriculture and allied sectors - Sakshi

‘స్వేదాన్ని చిందించి సిరులు పండిస్తున్న రైతన్నను చేయిపట్టి నడిపించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న తపనతో శ్రమిస్తున్న సీఎం జగన్‌ చిత్తశుద్ధిని చూసి ప్రకృతి పరవశిస్తోంది. వరుణుడు హర్షించి వర్షిస్తుండ­డంతో రైతు మోములో చెరగని చిరునవ్వులు విరబూస్తున్నాయి’ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.41,436.29 కోట్ల కేటాయింపులతో 2023–24 వ్యవ­సాయ బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మంత్రి ఏమ­న్నా­రంటే..
–  సాక్షి, అమరావతి

జాతీయ వృద్ధి రేటు కంటే మిన్నగా.. 
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న దివంగత వైఎస్సార్‌ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుండడంతో వ్యవసాయ రంగంలో అగ్రపథాన ఉన్నాం. 2021–22లో జాతీయ వృద్ధిరేటు 10 శాతం కాగా మన రాష్ట్రం 13.07 శాతం వృద్ధి సాధించింది.

2022–23లో జాతీయ వృద్ధి రేటు 11.2 శాతం కాగాæ మన రాష్ట్రంలో 13.18 శాతం నమోదైంది. రాష్ట్ర జీఎస్‌డీపీ పరిశీలిస్తే 2018–19లో రూ.2.70 లక్షల కోట్లు ఉండగా 2022–23లో రూ.4.40 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 1.70 లక్షల కోట్లు అధికంగా జీఎస్‌డీపీ నమోదైంది. 

44 నెలల్లో రూ.1.54 లక్షల కోట్లు  
గత 44 నెలల్లో వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు రూ.1.54 లక్షల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా రూ.27,062.09 కోట్లు అందించాం. సు­న్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీకి రూ.1442.66 కోట్లు, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాకి రూ.6,684.84 కోట్లు, పంట నష్ట పరిహారానికి రూ.1,911.81, ధాన్యం కొనుగోలుకు రూ.55,­401.58 కోట్లు ఇతర పంటల కొనుగోలుకు రూ.7,156 కోట్లు, శనగ రైతుల బోనస్‌కు రూ.300 కోట్లు, ఆర్బీకే స్థాయిలో యంత్ర పరికరాల ఏర్పాటుకు సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు, సా­గుకు పగటి పూట విద్యుత్‌ సరఫరా, ఫీడర్ల సామర్థ్యం పెంచడం, విద్యుత్తు రంగం బలోపేతానికి రూ.53,456 కోట్లు ఖర్చు చేశాం. 

కర్షక దేవాలయాలుగా ఆర్బీకేలు 
గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేలను ఉత్పాదకుల విక్రయ, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాం. 535 ఆర్బీకేలకు సొంత భవనాలుండగా 1,513 భవనాల నిర్మాణం పూర్తైంది. 8730 భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాలు సైతం ఏపీ విధానాలను ప్రశంసిస్తున్నాయి. 2022–23 ఎఫ్‌పీఓ చాంపియన్‌ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్‌ కావడం గర్వకారణం. 2 లక్షల సబ్‌ౖస్క్రెబర్స్‌తో ఆర్బీకే యూట్యూబ్‌ చానల్, లక్ష మంది చందాదారులతో రైతు భరోసా మాసపత్రిక ఆదరణ పొందాయి. 

రికార్డు స్థాయి దిగుబడులు 
సీఎం జగన్‌ పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదే రికార్డు స్థాయిలో 175 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వచ్చాయి. 2021–­22లో గులాబ్‌ తుపాన్, అధిక వర్షాలు కురిసినప్పటికీ 155 లక్షల టన్నులు నమోదు కాగా 2022–23లో 169 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా తరహా పథకం దేశంలోనే ఎక్కడా లేదు. పంట సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు రైతుల ఖాతాలోనే బీమా పరిహారం సొమ్ములు జమ చేస్తున్నాం.  

కరువు ఛాయలే లేవు 
చంద్రబాబు హయాంలో ఏటా 100కు పైగా మండలాలు కరువు బారినపడితే ఇప్పుడు ఒక్క మండలం కూడా కరువు ఛాయల్లో లేదు. ఇప్పటిదాకా రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చాం. పంటసాగుదారుల హక్కు చట్టం తెచ్చాం. 9.20 లక్షల మందికి రూ.6,229.28 కోట్ల పంట రుణాలిచ్చాం. దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడే రైతన్నల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం.  

ఏపీ సీడ్స్‌కు అవార్డుల పంట 
ఆర్బీకేల ద్వారా 2022–23లో 12.56 లక్షల రైతులకు 7.17 లక్షల క్వింటాళ్ల రూ.202.66 కోట్ల రాయితీపై పంపిణీ చేశాం. పారదర్శకంగా అందించిన ఏపీ సీడ్స్‌కు పలు అవార్డులు దక్కాయి. ఆర్బీకేల ద్వారా ఈ ఏడాది 5 లక్షల మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణ ఫలితాలతో ప్రతీ రైతుకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు అందచేస్తాం.  ఆర్బీకేల ద్వారా రూ.440 కోట్ల విలువైన ఎరువులందించాం. బస్తాపై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గించాం. వచ్చే ఏడాది 10 లక్షల టన్నుల ఎరువులు, సూక్ష్మపోషకాలను ఆర్బీకేల ద్వారానే పంపిణీ చేస్తాం. 

రైతులకు వ్యక్తిగత పరికరాలు 
ఈ ఏడాది 7 లక్షల మంది రైతులకు 50 శాతం రాయితీపై రూ.450 కోట్లతో టార్పాలిన్లు, స్ప్రేయర్లు అందచేస్తాం. దశల­వారీగా పది వేల ఆర్బీకేల్లో కిసాన్‌ డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. అందులో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల­తో 2 వేల కిసాన్‌ డ్రోన్లను 40 శాతం రాయితీపై అందుబాటులోకి తెస్తాం.

ని­యో­­జకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 9 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌­తో పాటు రీజనల్‌ స్థాయిలో 4 కోడింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాగులు, సజ్జలు, జొన్నలకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటిస్తే మిగిలిన చిరుధాన్యాలకు క్వింటాల్‌కు రూ.25­00 చొప్పున ఎమ్మెస్పీ ప్రకటించాం. హెక్టార్‌కు రూ.6 వేల ప్రోత్సా­హాన్ని అందిస్తున్నాం.

పట్టు సాగు విస్తరణ కోసం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 90 శాతం రాయితీ అందిస్తున్నాం. సీఎం యాప్‌ ద్వా­రా  పంట ఉత్పత్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట మార్కెట్‌లో జో­క్యం చేసుకొని రైతులకు అండగా నిలుస్తున్నాం. మత్స్యకార భరోసా కింద గతేడాది 1.05 లక్షల మందికి రూ.106 కోట్ల నిషేధ భృతిని అందజేశాం. రూ.3,605.89 కోట్ల­తో 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్మిస్తున్నాం. 

ఉద్యాన హబ్‌గా రాష్ట్రం  
ఆయిల్‌ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి, మిరప సాగు, దిగుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 314.78 లక్షల టన్నులతో దేశీ పండ్ల ఉత్పత్తిలో 15.60 శాతం వాటాతో దూసుకెళ్తోంది. 2022లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఐదుగురు ఉద్యాన రైతులు దక్కించుకున్నారు.

ఉద్యాన రంగం 10.56 శాతం వృద్ధి నమోదు చేసింది. సూక్ష్మసాగు నీటిపథకం కింద  2022–23లో 1.38 లక్షల ఎకరాల్లో తుంపర, బిందు పరికరాలను అమర్చాం. ఆయిల్‌ సాగు విస్తరణను ప్రోత్సహించేందుకు మొక్కలు నాటేందుకు ఇచ్చే రాయితీని హెక్టార్‌కు రూ.12 వేల నుంచి రూ.29 వేలకు పెంచాం. పాత తోటల పునరుద్ధరణ కోసం ఒక్కో మొక్కకు రూ.250 చొప్పున ప్రత్యేక సాయం ఇస్తున్నా

Advertisement

తప్పక చదవండి

Advertisement