మామిడి టన్ను రూ.37 వేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి టన్ను రూ.37 వేలు

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో గురువారం మామిడి టన్ను గరిష్ట ధర రూ.37 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 230 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టం రూ.37 వేలు, కనిష్టం రూ.20 వేలు, సరాసరి రూ.29 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. మల్లికా రకం టన్ను గరిష్టం రూ.35 వేలు, కనిష్టం రూ.20 వేలు, సరాసరి రూ.30 వేలు కాగా హిమాయత్‌ రకం టన్ను గరిష్టం రూ.20 వేలు, కనిష్టం రూ.15 వేలు, సరాసరి రూ.17 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement