నేటి నుంచి అంతర్ కళాశాలల మహిళల క్రీడాపోటీలు
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో శుక్ర, శనివారాల్లో అంతర్ కళాశాలల మహిళల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ చైర్మన్ హోదాలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ తెలిపారు. గురువారం కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు శ్రీరామ్, శత్రుజ్ఞ, నగేశ్‌నాయక్‌తో కలసి టోర్నీ వివరాలను ఆమె విలేకరులకు వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అనిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, రిజిస్టర్ రమేష్‌బాబు, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ జెస్సీ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బాల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, క్రికెట్, హాకీ, ఖోఖో, బాక్సింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని దక్షిణ భారతదేశ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేస్తారన్నారు.
సాదాసీదాగా అహుడా గ్రీవెన్స్
అనంతపురం క్రైం: అహుడా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సాదాసీదాగా జరిగింది. అనంతరం సంబంధిత అధికారులతో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్‌తో కలిసి జేసీ శివ్‌నారాయణ్ శర్మ సమీక్షించారు. అనధికార లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మవరం పరిధిలోని కొణుతూరు లే అవుట్‌లో ప్లాట్ల విక్రయానికి అనంతపురంలోని అహుడా కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెనుకొండ, మడకశిర ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్‌ల విక్రయానికి వేలం నిర్వహించాలన్నారు. హిందూపురం, కోడూరు ఎంఐజీ లేఅవుట్ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ కేఎండీ.ఇషాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుష్యంత్, డీఈ రేవంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్, ఏఓ రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అంతర్ కళాశాలల మహిళల క్రీడాపోటీలు
నేటి నుంచి అంతర్ కళాశాలల మహిళల క్రీడాపోటీలు
నేటి నుంచి అంతర్ కళాశాలల మహిళల క్రీడాపోటీలు
నేటి నుంచి అంతర్ కళాశాలల మహిళల క్రీడాపోటీలు


