బ్యాట్ పడితే పరుగుల వర్షమే
గుంతకల్లు: స్థానిక నాయీ బ్రాహ్మణ కాలనీలో నివాసముంటున్న బట్నపాడు ధనుంజయ, లీలా దంపతులకు అమూల్య, నందని అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుల వృత్తితో ధనుంజయ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మరొకరు సెకండియర్ చదువుతున్నారు. చిన్నప్పుడు సరదాగా బ్యాటింగ్ చేస్తూ సందడి చేస్తున్న కుమార్తెల ఆసక్తిని గమనించిన ధనుంజయ వారిని క్రికెట్ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు.
ఆర్డీటీ సహకారంతో..
గుంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న నందిని, అమూల్య.. 2019లో గుంతకల్లులోని ఎస్‌జేపీ హైస్కూల్‌లో ఆర్డీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో తొలిసారిగా పాల్గొన్నారు. ఆ సమయంలో వారిలోని ఆసక్తిని గమనించిన స్థానిక కోచ్ జోషి.. ఏసీఏ కోచ్‌లు యుగంధర్‌రెడ్డి (యోగి), నరేష్... ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిలోని క్రీడానైపుణ్యాలకు మెరుగుపడుతూ వచ్చారు. వారి శిక్షణలో అక్క అమూల్య వికెట్ కీపింగ్‌తో పాటు ఓపెనర్‌గా, చెల్లెలు నందిని ఆల్‌రౌండర్‌గా రాటు దేలుతున్నారు
అమూల్య.. ఆట తీరే వేరు
వికెట్ కీపర్‌గాను, బ్యాటింగ్ ఓపెనర్‌గా అమూల్య తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటోంది. 2022–23, 2023–24 జోనల్ పోటీలు, ఏపీఎల్ టోర్నీల్లో పాల్గొంది. ఇప్పటి వరకూ 68 మ్యాచ్‌లు ఆడిన అమూల్య.. 1,089 పరుగులు సాధించి, 100కు పైగా క్యాచ్‌లు పట్టింది.
ఆల్‌రౌండర్‌గా నందిని..
రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్‌గా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో నందిని తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2022–23, 2023–24లో ఆర్డీటీ నిర్వహించిన పలు టోర్నీలతో పాటు, ఏపీఎల్ పోటీల్లోనూ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందింది. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన అండర్–15 జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించి, జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించింది. మొత్తం 72 మ్యాచ్‌ల్లో 979 పరుగులు చేసి 78 వికెట్లను సొంతం చేసుకుని ప్రత్యేకతను చాటుకుంది.
క్రికెట్‌లో రాణిస్తున్న బట్నపాడు సిస్టర్స్
ఆర్డీటీ సహకారంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా
ఆర్డీటీ సహకారం మరువలేను
క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆర్డీటీ సహకారం మరువలేను. ఇండియా జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా వారు సాగిస్తున్న ప్రయత్నాలకు స్థానిక దాతలు కొందరు గొప్ప మనసుతో సహకరిస్తున్నారు.
– బట్నపాడు ధనుంజయ, గుంతకల్లు
బ్యాట్ పడితే పరుగుల వర్షమే
బ్యాట్ పడితే పరుగుల వర్షమే
బ్యాట్ పడితే పరుగుల వర్షమే


