‘సర్దార్’ సేవలు నిత్య స్మరణీయం
● ఏక్తా ర్యాలీలో కలెక్టర్ ఆనంద్
అనంతపురం కల్చరల్: భారత తొలి రక్షణ శాఖ మంత్రిగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ అందించిన సేవలు నిత్య స్మరణీయమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నగరంలో ఐక్యతా మార్చ్ ఘనంగా జరిగింది. యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద వందలాది మందితో సాగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ చొరవతోనే 565 సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్నారు. ఆయన అడుగుజాడల్లో యువత నడిచి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారత్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద అధికారులు ఘనంగా నివాళులర్పించారు. నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్ శిష్యబృందం శాసీ్త్రయ నృత్యనీరాజనాలర్పించింది. కార్యక్రమంలో మై భారత్ ప్రోగ్రాం ఇన్‌చార్జి గోవర్దన్ శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, ఆర్ట్స్‌కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి అజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


