 
															ఓఎంసీలో కొనసాగిన తనిఖీలు
డీ హీరేహాళ్ (రాయదుర్గం): డీ హీరేహాళ్ మండల పరిధిలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో మైనింగ్, అటవీశాఖ అధికారులు వరుసగా రెండో రోజు గురువారం కూడా తనిఖీలు నిర్వహించారు. మైన్స్ అండ్ జియాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎఫ్‌ఓ (సోషల్ ఫారెస్ట్) గురుప్రభాకర్ ఆధ్వర్యంలో సరిహద్దులు పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అండ్ జియాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓబుళాపురం పరిసరాల్లోని ఆరు ఐరన్‌ఓర్ కంపెనీల లీజుల సరిహద్దులను పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు సమర్పించిన తర్వాత సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యటిస్తుందన్నారు. వీరి పర్యవే క్షణలో మైనింగ్ లీజు హద్దులను తేల్చి సుప్రీంకోర్టుకు నివేదిక అందిస్తామన్నారు. డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 10లోపు సర్వే పనులు పూర్తిచేస్తామన్నారు.
తాగడం వల్ల కాదు..
మానేసినందుకే అస్వస్థత
● చౌళూరు ఘటనపై
ఎకై ్సజ్ శాఖ వింత భాష్యం
హిందూపురం టౌన్: ‘హిందూపురం ప్రాంతంలో ఇటీవల కల్తీ కల్లు తాగి కొంతమంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నది అవాస్తవం. కల్లు, మద్యానికి బాగా అలవాటు పడిన వారు ఒక్కసారిగా మానేస్తే వచ్చే అనర్థాల వల్లే ఆస్పత్రి పాలయ్యారు’ అంటూ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ బుధవారం చౌళూరులో చోటుచేసుకున్న ఘటనపై వింత భాష్యం చెప్పారు. హిందూపురం మండలం చౌళూరు గ్రామంలో బుధవారం కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురి కాగా, వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. కల్తీ కల్లు వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని చౌళూరు గ్రామస్తులే ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్, సీఐ లక్ష్మీదుర్గయ్య విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా బ్రాందీ, విస్కీ, కల్లు సేవిస్తున్న వారు ఉన్నట్టుండి ఆ అలవాటు మానుకుంటే అనారోగ్యానికి గురికావడం, మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వైద్యులు కూడా తెలిపారన్నారు. బుధవారం చౌళూరులో జరిగిన ఘటన కూడా ఇలాంటిదేనన్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు, నకిలీ మద్యం విక్రయాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆటో బాడుగ అడిగినందుకు పచ్చ మూక దాడి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దల గ్రామంలో పచ్చమూక రెచ్చిపోయింది. ఆటో బాడుగ డబ్బు అడిగినందుకు ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది. 15 ఏళ్ల వయసున్న బాలుడిని కిందపడేసి ఇష్టానుసారంగా తొక్కి, కాళ్లతో బలంగా తొక్కడంతో విషమ పరిస్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. బాధిత కుటుంబం తెలిపిన మేరకు.. న్యామద్దల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు వెంకటేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక టీడీపీ నేత మురళి ఇటీవల ఆటోను బాడుగకు తీసుకెళ్లాడు. రోజులు గడుస్తున్నా బాడుగ డబ్బు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి తన ఇంటి ఎదుట తారసపడిన మురళిని వెంకటేష్ పలకరిస్తూ ఆటో బాడుగ డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఆ సమయంలో మురళి తాను బాడుగ డబ్బు అప్పుడే ఇచ్చానని బుకాయిస్తూ గొడవకు దిగాడు. భర్తతో గొడవ పడుతుండడం గమనించిన వెంకటేష్ భార్య రమాదేవి, కుమారులు కిషోర్, హేమంత్ అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే టీడీపీకి చెందిన బయన్న, నాగేశ్వరితో కలసి మురళి రెచ్చిపోతూ వెంకటేష్‌తో పాటు అతని కుటుంబసభ్యులపై దాడికి తెగబడ్డారు. హేమంత్‌ను కింద వేసి కాళ్లతో తొక్కి బలంగా తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు చెన్నేకొత్తపల్లిలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. నొప్పిని తాళలేక కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోతుండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.
 
							ఓఎంసీలో కొనసాగిన తనిఖీలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
