జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ఎంపిక

Oct 31 2025 7:43 AM | Updated on Oct 31 2025 7:43 AM

జాతీయ

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ఎంపిక

అనంతపురం సిటీ: జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్లు అనంతపురం సైన్స్‌ సెంటర్‌ అధికారి బాలమురళీకృష్ణ గురువారం తెలిపారు. హనకనహళ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన గీతారెడ్డి, రాయదుర్గం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీసాయిదీప్తి ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. నవంబర్‌ 6 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగే సైన్స్‌ కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారన్నారు. అక్కడి ప్రముఖ సైన్స్‌ కేంద్రాలు, సైన్స్‌ మ్యూజియం, రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌, నెహ్రూ ప్లానిటోరియం లాంటి ప్రఖ్యాత విజ్ఞాన ప్రదేశాలను విద్యార్థులు సందర్శిస్తారన్నారు. సైన్స్‌ పట్ల ఆసక్తి, వివిధ సందర్భాల్లో నిర్వహించిన సైన్స్‌ కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్య నేపథ్యం పరిశీలించి జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎంపిక చేశారన్నారు.నాసా కేంద్రంలో పని చేసే ప్రముఖ ఇంజినీర్‌తో ముఖాముఖి చర్చలోనూ పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎంపికైన విద్యార్థినులను డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శైలజా చౌదరి అభినందించారు.

నవంబర్‌ 11న

వైఎస్సార్‌ సీపీ ర్యాలీ

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో నవంబర్‌ 4న తలపెట్టిన ర్యాలీ కార్యక్రమం వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. తుపాన్‌ దృష్ట్యా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 11న జరిగే ర్యాలీల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

జాతీయ స్థాయి సైన్స్‌  పోటీలకు ఎంపిక 1
1/2

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి సైన్స్‌  పోటీలకు ఎంపిక 2
2/2

జాతీయ స్థాయి సైన్స్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement