ఒక్క సంతకంతో భావితరాలకు ఉజ్వల భవిత
కళ్యాణదుర్గం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసే ప్రతి ఒక్క సంతకం భావితరాలకు ఉజ్వల భవిత కానుందని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. బుధవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో కలసి స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ వార్డుల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణను ఆపేలా గవర్నర్‌కు లేఖ పంపేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా వార్డులలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం కన్వీనర్ సుధీర్, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, రాజ్‌కుమార్, నాయకులు గణేష్, ఉమాపతి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి కృష్ణమూర్తి, కామక్కపల్లి మల్లి, యూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు యాదవ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు చరణ్, మురళి, రామిరెడ్డి, దొడ్ల తిప్పేస్వామి, షెక్షావలి, అజయ్, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య


