పేద విద్యార్థుల డాక్టర్ కల ఛిద్రం
అనంతపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంతో పేద విద్యార్థుల డాక్టర్ కలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’కు విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సంతకాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘అనంత’ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా మారిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజాప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లామన్నారు. రూ.8 వేల కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అప్పట్లోనే రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తమ పార్టీ హయాంలోనే ఏడు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి ఐదింట్లో తరగతులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. నిర్మాణంలో ఉన్న కళాశాలలను నేడు చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అలా చెప్పడం సిగ్గుచేటు..
ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెప్పడం దుర్మార్గమన్నారు. ఏడాదికి రూ.1,000 కోట్లు ఖర్చు చేసినా 10 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒకే దఫా 17 మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావడానికి వైఎస్ జగన్ చూపిన దార్శనికతే కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, మైనారిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాగజ్‌ఘర్ రిజ్వాన్, మాసినేని నరేష్, కృష్ణా రెడ్డి, జిల్లా కార్యదర్శులు అనిల్ కుమార్ గౌడ్, ప్రకాష్, వెంకట రెడ్డి, సుబ్రమణ్యం, నగర ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీనివాస్, కార్యదర్శులు రామాంజి రాయల్, హుస్సేన్, కార్పొరేటర్లు నాగార్జున రెడ్డి, లీలావతి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, బూత్ కమిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమరనాథ రెడ్డి, బీసీ సెల్ నగర కార్యదర్శి రామకృష్ణ, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, సాకే కుళ్లాయి స్వామి, దాదాపీర్, హరి, చంటి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల కోసం డబ్బు ఖర్చు చేయలేమనడం దుర్మార్గం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
వ్యాఖ్యలు సిగ్గుచేటు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
పేద విద్యార్థుల డాక్టర్ కల ఛిద్రం


