
ఉపాధి పనులు లేవు
మూడు వారాల కూలి రావాలి
వ్యవసాయ సీజన్ అని చెప్పి గ్రామంలో మూడు నెలలుగా ఉపాధి పనులు కల్పించ లేదు. కనీసం వ్యవసాయ కూలి పనులతోనైనా నెట్టుకొద్దామంటే ఆ పనులూ అరకొరగానే ఉన్నాయి. వారంలో రెండు రోజులు పనికి వెళ్తే మిగిలిన ఐదు రోజులూ ఇంటి వద్దనే ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలతో కలసి కొడుకులు వలస పోయారు. ఉన్న దాంట్లోనే ఓ పూట తిని, మరో పూట పస్తులుంటున్నాం.
– భీమా నాయక్, నక్కనదొడ్డి తండా
ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి మూడు వారాల కూలి ఇప్పటి వరకూ ఇవ్వలేదు. దీనికి తోడు మూడు నెలలుగా పనులు ఆపేశారు. వర్షాలు లేక వ్యవసాయ పనులూ లేకుండాపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఊరి వదిలి వెళ్లకతప్పలేదు.
– సాలమ్మ, నక్కనదొడ్డి తండా
పనులు నిలిపిన మాట వాస్తవం
వ్యవసాయ సీజన్ కారణంగా ఉపాధి పనులు నిలిపిన మాట వాస్తవం. ఉపాధి పనులకు గ్రామస్తులు హాజరయ్యేలా ఉంటే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా డిమాండ్ పెట్టిస్తే వెంటనే పనులు కల్పిస్తాం.
– కృష్ణమూర్తి, ఏపీఓ, డ్వామా

ఉపాధి పనులు లేవు