దళిత బిడ్డకు న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

దళిత బిడ్డకు న్యాయం చేయండి

Jul 24 2025 7:46 AM | Updated on Jul 24 2025 7:46 AM

దళిత బిడ్డకు న్యాయం చేయండి

దళిత బిడ్డకు న్యాయం చేయండి

చైర్‌పర్సన్‌ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు..

గిరిజన విద్యార్థిని తన్మయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

● మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం వినతి

అనంతపురం కార్పొరేషన్‌: మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు కోరారు. బుధవారం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజను వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులు, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని తన్మయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ రెండు ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. తన్మయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేయాలన్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ విషయంపై విన్నవించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కాగా, శైలజ విలేకరులతో మాట్లాడారు. యువత, అమ్మాయిలపై సినిమాల ప్రభావం తీవ్రంగా ఉంటోందని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సాధికారతపై అన్ని జిల్లాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజలి, పంచాయతీరాజ్‌ విభాగం ప్రధాన కార్యదర్శి హజర, మహిళా నాయకురాళ్లు ఉష, రాధాయాదవ్‌, భారతి, లీలా, ఎస్సీ, ఎస్టీ సెల్‌ నాయకులు చిరంజీవి, నాగరాజు నాయక్‌, మణికంఠ, సంగమేష్‌ పాల్గొన్నారు.

‘బాలికకు ప్రభుత్వం అన్నీ సమకూర్చింది’

ఏడుగుర్రాలపల్లిలో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్‌ బాలికకు ప్రభుత్వం అన్నీ సమకూర్చిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రి లేబర్‌ వార్డులో ఉన్న బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రిలో బాలికకు సుఖ ప్రసవం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నిందితులను పోలీసులు సకాలంలో అరెస్టు చేశారన్నారు.

మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన బాలికను కనీసం ఆ ప్రాంత ఎమ్మెల్యే పరిటాల సునీత, ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు పరామర్శించిన దాఖలాలు లేవు. మొదట్లో బాలికకు జరిగిన అన్యాయం పట్ల శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు స్పందించనే లేదు. బాలిక తరఫున ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ అప్పట్లో సీఐ, ఎస్‌ఐలు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ‘సాక్షి’లో కథనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో చలనమొచ్చింది. ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట తప్పదని భావించి చర్యలకు ఉపక్రమించింది. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ ఊదరగొడుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై కనీసం మాట కూడా మాట్లాడలేదు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అన్నీ చేశామని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement