
●ఆగని ‘తెలుగు తమ్ముళ్ల’ ఇసుక దందా
శింగనమల: టీడీపీ నాయకుల ఇసుక దందా ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యథేచ్ఛగా ప్రకృతి వనరును కొల్లగొడుతున్నారు. ఇప్పటికే శింగనమల మండలంలోని పెరవలి, పి.జలాలపురం, చీలేపల్లి, సలకంచెరువు, రాచేపల్లి, నిదనవాడ, తరిమెల, కల్లుమడి గ్రామాల నుంచి ఇసుక తరలించేశారు. తాజాగా చాగల్లు రిజర్వాయర్‌లో బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో ఇసుకను కొల్లగొట్టడం ప్రారంభించారు. నెల రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. పెన్నా నదిలో జేసీబీ ద్వారా ఇసుకను ట్రాక్టర్లలో నింపి సమీపంలోని తోటలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు వేరే ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘పచ్చ’ నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తుండడంతో భూగర్భజలం తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

●ఆగని ‘తెలుగు తమ్ముళ్ల’ ఇసుక దందా