
టీడీపీ నాయకుల బరి తెగింపు
● వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లతో దాడి
● విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు గోపి తలకు లోతైన గాయం
బ్రహ్మసముద్రం: మండలంలో టీడీపీ నేతలు బరితెగించారు. కక్షకట్టి ఎర్రప్ప దొడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు గొల్ల గోపి, కార్యకర్త బాలకృష్ణపై వేటకొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు గోపి తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం తన పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెడుతుండగా టీడీపీకి చెందిన డీలర్ కృష్ణమూర్తి, అతని అనుచరులు గోవిందు, నాగరాజు, తిప్పేస్వామి, రాజప్ప, ఎర్రిస్వామి, మైలారీ తదితరులు వేటకొడవళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఘటనలో గోపి తలకు లోతైన గాయమైంది. బాలకృష్ణకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు హుటాహుటి కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు.

టీడీపీ నాయకుల బరి తెగింపు