
నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలు
ఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు నేటి నుంచి హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది.