
కూటమి పాలనలో పీఆర్ వ్యవస్థ నిర్వీర్యం
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్ (పీఆర్) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం తక్షణం చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బసవ రాజు, బండి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు సీవీరంగారెడ్డి, సాదక్‌వలి, నియోజకవర్గ అధ్యక్షుడు మూలి లోకనాథరెడ్డి, విజయకుమార్, తిప్పేస్వామి, తిక్కస్వామి, భూతవి సుధాకర్, యోగష్‌రెడ్డి, చిన్నరంగారెడ్డి, జెడ్పీటీసీలు జె.చంద్రకుమార్, ఈశ్వరయ్య, వైస్ ఎంపీపీ ప్రసాద్‌గౌడ్, సర్పంచులు ఓబులేసు, చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, నాయకులు కుమ్మెత చంద్రశేఖరరెడ్డి, రుద్రనంద యాదవ్, రవికుమార్, రమేష్, అంజియాదవ్, బండిపవన్, గోవిందరెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి
కలెక్టరేట్ ఎదుట ధర్నా