
● తీరని క‘న్నీటి’ వ్యథ
గుంతకలుల్లో నిరసన తెలుపుతున్న మహిళలు
గుంతకల్లు: తాగునీటి కోసం స్థానిక బీటీ ఫక్కీరప్ప కాలనీ సోమవారం ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా మున్సిపల్ కొళాయిలకు నీరు విడుదల కాకపోవడంతో కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో సోమవారం సీపీఐ నాయకులతో కలిసి కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీ లోనే జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరభద్రస్వామి, గోపీనాథ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఫలితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. 6 రోజులుగా తాగునీరు అందకపోతే ప్రజల దాహార్తి తీరేదేలా అని ప్రశ్నించారు. కాలనీలో డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు. అధికారులు ఇప్పటికై నా స్సందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.