
2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిస్తామన
చిన్నముష్టూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో వర్షపు నీటిలో
ౖపైపెనే మట్టిని పక్కకు జరుపుతున్న దృశ్యం
ఉరవకొండ: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అయిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం కరువు పీడిత అనంతపురం జిల్లాకు జీవనాడి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలనే లక్ష్యంతో అప్పట్లో ఈ పథకానికి రూపకల్పన చేశారు. అయితే, వైఎస్సార్ ఆకస్మిక మరణంతో లక్ష్యం నీరుగారిపోయింది. హంద్రీ–నీవా ఫేజ్–1 కింద 2012లో పనులు పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్టా జలాలు చేరినా, నేటికీ పొలాలను తడపలేకపోతుండటమే ఇందుకు నిదర్శనం.
బూటకపు ప్రకటనలతో సరి..
హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని 2014 నుంచి బూటకపు ప్రకటనలు చేస్తూనే ఉన్న చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అందుకు సంబంధించిన పనులు చేపట్టనే లేదు. ఉరవ కొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలంలో 33, 34 ప్యాకేజీ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఈ ప్యాకేజీల కింద 28 వేల ఎకరాల ఆయకట్టు ఉండటం గమనార్హం. అబద్ధపు హామీలతో ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు.. 2015లో హంద్రీ–నీవా కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయరాదంటూ ఏకంగా జీఓ నం.22 తీసుకొచ్చి అన్నదాతలను నైరాశ్యంలోకి నెట్టారు. దీనిపై అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే.. 2017 ఖరీఫ్‌కు సాగునీరు ఇస్తామని ప్రకటించి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఈ విషయంపై ఆ తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వ ఉద్యమాలు చేపట్టినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
అంతా ఆర్భాటమే..
ఆయకట్టుకు నీళ్లందించడంపై దృష్టి సారించని కూటమి ప్రభుత్వం.. నేడు హంద్రీ–నీవా కాలువ విస్తరణ పేరిట ఆర్భాటం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే 3,800 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో రూపకల్పన చేసిన కాలువను 6 వేల క్యూసెక్కులకు పెంచుతామని ఇటీవల ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, నేడు ఆ హామీని తుంగలో తొక్కుతూ విస్తరణ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. ఆ పనులు కూడా అస్తవ్యస్తంగా సాగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఈ నెల 9న సీఎం పర్యటన నేపథ్యంలో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలో నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలో జేసీబీల సాయంతో కేవలం కాలువకిరువైపులా మట్టిని పక్కకు జరిపి చేతులు దులుపుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
మాట నిలుపుకోని సీఎం చంద్రబాబు
హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలను అటకెక్కించి దగా
నేడు విస్తరణ పేరిట ఆర్భాటం
రైతులకు ఒరిగేది శూన్యం

2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిస్తామన

2014 ఖరీఫ్‌లోనే హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిస్తామన