
ఆర్డీటీ పరిరక్షణే వైఎస్సార్‌సీపీ లక్ష్యం
కళ్యాణదుర్గం: జిల్లా ప్రజల జీవనాడిగా, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా ఉన్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య స్పష్టం చేశారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌తో కలిసి ‘సేవ్ ఆర్డీటీ’ ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకతీతంగా కలిసొచ్చే ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలతో కలసి ఈ నెల 17న చేపట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రహ్మసముద్రం నుంచి శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మీదుగా కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయం వరకూ బైకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ చేయాలంటూ ఆర్టీఓకు వినతి పత్రం అందజేస్తామన్నారు. అలాగే సేవ్ ఆర్డీటీ పేరుతో గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకూ పోరాటాలు చేసేందుకు పార్టీ పెద్దలతో సంప్రదించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామన్నారు. ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ద్వారా లబ్దిపొందిన గ్రామాల ప్రజలు బాహటంగానే పేర్కొంటున్నారని తెలిపారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే పేదలే తీవ్ర ఇబ్బందులు పడతారనే విషయాన్ని ఈ నెల 9న ఉరవకొండకు రానున్న సీఎం చంద్రబాబును కలసి వివరించి, ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణకు వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేయనున్నామన్నారు.
సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్.వెంకటేశులు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.గంగాధరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మరాయుడు, డాక్టర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు బొమ్మయ్య, జిల్లా కార్యదర్శి వై.కృష్ణమూర్తి, మున్సిపాలిటీ విభాగం కన్వీనర్ సుధీర్, వివిధ మండలాల కన్వీనర్లు హనుమంతరాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, ఎంపీపీలు ఆంజినేయులు, నాగరాజు, అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు చరణ్, పాతలింగ, భాస్కర్, విజయ్, షెక్షావలి, మురళి, పాండు, అజయ్, ప్రతాప్, రామిరెడ్డి, మల్లికార్జున, కిరణ్‌కుమార్, తిమ్మారెడ్డి, సర్పంచులు బాబు, విజయ్, సోమశేఖర్‌రెడ్డి, విరుపాక్షి, కౌన్సిలర్ పరమేశ్వరప్ప, ఎంపీటీసీ మల్లేశు, నాయకులు శ్రీనివాసరెడ్డి, జానీ, దేవ పాల్గొన్నారు.
17న నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ
కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త రంగయ్య, నేతలు
తిప్పేస్వామి, మాదినేని ఉమా