సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండపై పాగా వేసి సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. అధికారంలో ఉన్నాం.. అందినంత దోచుకుందాం అనే రీతిలో పేట్రేగిపోతున్నారు. పెద్దకొండను ఇష్టానుసారం తవ్వేస్తూ అనకొండలుగా మారారు. కొంతకాలానికి కొండ ఆనవాళ్లు లేకుండా ప | - | Sakshi
Sakshi News home page

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండపై పాగా వేసి సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. అధికారంలో ఉన్నాం.. అందినంత దోచుకుందాం అనే రీతిలో పేట్రేగిపోతున్నారు. పెద్దకొండను ఇష్టానుసారం తవ్వేస్తూ అనకొండలుగా మారారు. కొంతకాలానికి కొండ ఆనవాళ్లు లేకుండా ప

May 5 2025 8:04 AM | Updated on May 5 2025 8:04 AM

సంపాద

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండ

అక్రమార్కుల ఆగడాలకు

సాక్ష్యం..

ఈ పెద్దకొండ

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కృష్ణమరెడ్డిపల్లి సమీపంలోని 231 సర్వే నంబరు (చియ్యేడు పొలం)లో పెద్దకొండ కరిగిపోతోంది. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు తెలుగు తమ్ముళ్లే కొండను కరిగించేస్తున్నారు. ‘అధికారం మాదే...మమ్నల్ని ఆపేదెవరు?’ అంటూ రెచ్చిపోతున్నారు. ఈ కొండ ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. అనంతపురం–కదిరి జాతీయ రహదారికి ఎడమ వైపు కూతవేటు దూరంలో ఉంది. అనుమతులు లేకపోయినా బరి తెగించి ఈ కొండ నుంచి సహజ వనరులను కొల్లగొడుతున్నారు. మొన్నటిదాకా కొండకు ఉత్తరం వైపు (కృష్ణమరెడ్డిపల్లి) మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’.. అక్కడి లీజుదారులు అభ్యంతరం తెలపడంతో వారం రోజులుగా దక్షిణం వైపు (చియ్యేడు) నుంచి తవ్వుతూ వస్తున్నారు.

కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు కలసికట్టుగా దోపిడీకి తెర తీశారు. హిటాచీ, జేసీబీల సాయంతో మట్టిని తవ్వుతూ టిప్పర్లలో నింపుతున్నారు. వీరిలో ఒకరికి మూడు టిప్పర్లు ఉన్నాయి. ఇద్దరికీ కలిసి ఒక హిటాచీ వాహనం ఉంది. వీరి టిప్పర్లే కాకుండా బయట వారికి కూడా లోడింగ్‌ చేస్తున్నారు. బయటి వాహనాలకు ఒకసారి లోడింగ్‌ చేసినందుకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. వారి సొంత వాహనాల ద్వారా నిత్యం నగరానికి మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు మట్టి రూ.6–7 వేల దాకా అమ్ముతున్నారు. రోజూ 90 ట్రిప్పుల దాకా మట్టి తరలిస్తున్నారు. ఖర్చులన్నీ పోను రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. గతంలో ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇటీవలి కాలంలో ‘పెద్దకొండ’ పుణ్యమా అని రూ.కోట్లకు పడగలెత్తారు.

ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

కృష్ణమరెడ్డిపల్లికి చెందిన

ఇద్దరు టీడీపీ నేతల బరితెగింపు

రోజూ 90 ట్రిప్పుల దాకా

ఎర్రమట్టి తరలింపు

ఉత్తరం వైపు అడ్డుకుంటే

దక్షిణం వైపు నుంచి తవ్వకాలు షురూ

పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులకు

నెలవారీ మామూళ్లు!

ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ నిరాటంకంగా సహజ వనరుల దోపిడీ

అందరికీ నెలవారీ మామూళ్లు..

వీరి అక్రమ దందాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖలోని విజిలెన్స్‌ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే అక్రమ రవాణా విషయంలో ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. నెలల తరబడి వీరి దందా సాగుతున్నా అధికారులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలను బలపరుస్తోంది. దీనికితోడు పొరపాటున ఎవరైనా వీరి వాహనాలను ఆపితే వెంటనే కొందరితో ఫోన్లు చేయిస్తున్నారు. తరచూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెబుతూ ‘మట్టి దందా’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

ఇద్దరూ ఇద్దరే...

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండ1
1/2

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండ

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండ2
2/2

సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement