
ఉచిత గ్యాస్ ఊసేదీ?
అనంతపుర అర్బన్: ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గత మార్చి వరకు ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా వర్తింపజేశారు. అయితే అది కూడా చాలామందికి అందలేదు. అధికారిక నివేదిక ప్రకారం ఉచిత సిలిండర్ పొందేందుకు జిల్లాలో 5.05 లక్షల మంది అర్హులు ఉండగా 4.03 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందారు. అర్హులుగా ఉన్నప్పటికీ 1,02,361 మందికి వివిధ కారణాలతో ఉచిత సిలిండర్ అందలేదు.
ఈ ఏడాది ఎప్పుడిస్తారో..?
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంంలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు నుంచి నవంబరు మధ్య రెండవ సిలిండర్, ఇక డిసెంబరు నుంచి మార్చి మధ్య మూడవ సిలిండర్ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఒక నెల గడిచిపోయింది. మే నెల ప్రారంభమైనా కూడా ప్రస్తుత ఏడాదికి సంబంధించి మొదటి సిలిండర్ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో ఉచిత సిలిండర్ ఎప్పుడిస్తారా.. అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.
ఏడాదికి మూడు సిలిండర్లు
ఇస్తామన్న ప్రభుత్వం
గత అక్టోబరు నుంచి
ఈ మార్చి వరకు ఒకదానితోనే సరి
అదీ 5 లక్షల మంది లబ్ధిదారుల్లో
4 లక్షల మందికే
ఈ ఏడాది మే నెల వచ్చినా
ఉచిత గ్యాస్ ఊసెత్తని ప్రభుత్వం
ఉచిత పథకానికి అర్హులు : 5,05,831
ఒక సిలిండర్ అందుకున్నవారు : 4,03,470
అర్హత ఉండి లబ్ధిపొందనివారు : 1,02,361
ఈ ఆర్థిక సంవత్సరంలో :
ఇంకా వర్తించలేదు

ఉచిత గ్యాస్ ఊసేదీ?