
వివాదాల్లేకుండా టీచర్ల బదిలీలు చేపట్టాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలో పీఆర్టీయూ నాయకులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు వీలైనంత త్వరగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థుల మధ్య నిష్పత్తిని తగ్గించాలన్నారు. వేసవి సెలవుల్లో సమ్మర్ కోచింగ్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఈఎల్ సదుపాయం కల్పించాలన్నారు. డీఈఓ పూల్‌లో ఉన్న పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఉర్దూ పాఠశాలలో తెలుగు పోస్ట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి. పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. తిమ్మారెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్. విష్షువర్ధన్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏ. కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వైసీ ప్రసాదరెడ్డి, బి. చితంబరరెడ్డి, ఎంవీ శివారెడ్డి, బాబయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్, జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
గాదె శ్రీనివాసులు నాయుడు