లింగ నిర్ధారణ తీవ్ర నేరం | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ తీవ్ర నేరం

May 4 2025 6:47 AM | Updated on May 4 2025 6:47 AM

లింగ నిర్ధారణ తీవ్ర నేరం

లింగ నిర్ధారణ తీవ్ర నేరం

అనంతపురం అర్బన్‌: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్రమైన నేరమని, ఎప్పటికప్పుడు స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, ఏఆర్‌టీ సరోగిసీ చట్టానికి సంబంధించి డిస్ట్రిక్‌ లెవల్‌ మల్టీ మెంబర్‌ అప్రాప్రియేట్‌ అధారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సంబంధించి పోస్టర్లను తయారు చేయాలని ఆదేశించారు. బాలికల కళాశాలల వద్ద బీట్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలన్నారు. టీనేజీ ప్రెగ్నేన్సీ నమోదైన వెంటనే హెల్త్‌, ఐసీడీఎస్‌ అధికారులు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. లింగ నిర్ధారణకు అడ్డుకట్టవేయాలన్నారు. ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలకు జరకూడదని, చట్టం అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఒకటవ ఏడీజే సత్యవాణి, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి, డాక్టర్‌ పార్వతి, ఆర్టీడీ ప్రతినిధి డాక్టర్‌ దుర్గేష్‌, డీఎస్పీ మహబూబ్‌బాషా, డిప్యూటీ హెచ్‌ఈఓ గంగాధర్‌, ఆశారాణి, రెడ్స్‌ భానూజా డెమో త్యాగరాజ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యాలను పూర్తి చేయాలి..

సచివాలయాల పరిధిలో చేపట్టిన మనమిత్ర క్యాంపెయిన్‌, తదితర కార్యక్రమాలకు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయాలు, ఇతర అంశాలపై కలెక్టర్‌ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆర్‌డీఓలు, డీఎల్‌డీఓలు ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, ప్రజారోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమిత్రకు సంబంధించి రోజుకు 17 వేల క్యాంపెయిన్‌ చేపట్టాలన్నారు. సిటిజన్‌ ఈ–కేవైసీ రోజుకు 10 వేలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కో–ఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, పీజీఆర్‌ఎస్‌ తహసీల్దారు వాణిశ్రీ, జీఎస్‌డబ్ల్యూఎస్‌ కో–ఆర్డినేటర్‌ ధనుంజయ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement