
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోటలో శుక్రవారం సాయంత్రం అరటి తోట దగ్దమైంది. వివరాలు... బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ములు బాషా, వలి రెండేళ్ల క్రితం ముచ్చుకోటలో భూమి కొనుగోలు చేసి అరటి సాగు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఉన్నఫళంగా అరటి తోటలో మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాధిత రైతులు వెంటనే సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేసింది. భాదిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శరత్‌చంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.