
జలపాతంలో కేరింతలు కొడుతున్న యువత
అనంతపురం కల్చరల్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా పర్యాటక కార్యాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు. ‘మీకు నచ్చిన కోట’ అనే అంశంపై సాగే పోటీలలో విద్యార్థులందరూ పాల్గొనాలని జిల్లా పర్యాటకశాఖాధికారి జి.నాగేశ్వరరెడ్డి కోరారు. మరిన్ని వివరాలకు ఆర్ట్ మాస్టర్ పురంధరుడి సెల్ నంబర్ 79979 09209ను సంప్రదించాలని సూచించారు.
జలపాతం హొయలు..
తలుపుల: రెండురోజులుగా కురిసిన వర్షాలకు మండలంలోని కదిరి–పులివెందుల రహదారి సమీపంలోని బట్రేపల్లి జలపాతం కళ సంతరించుకుంది. పైనుంచి జాలువారుతున్న నీటితో హొయలొలికిస్తోంది. జలపాతాన్ని చూడడానికి తలుపుల మండలవాసులే కాకుండా కదిరి, పులివెందుల తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.