
అపాయింట్‌మెంట్ లెటర్లను చూపుతున్న అభ్యర్థులు
ఉరవకొండ: పట్టణంలోని మహాత్మా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలకు చెందిన ప్రతినిధిలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 692 మంది నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. అందులో 280 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు అపాయింట్‌మెంట్ లెటర్లను కూడా ఇచ్చినట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఎల్.ఆనందరాజు తెలిపారు.