
గుంతకల్లు రూరల్: ఇరువర్గాల ఘర్షణలో నలుగురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని పులగుట్టపల్లి పెద్దతండాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోపాల్ నాయక్, నెట్టప్ప నాయక్‌లు మంగళవారం రాత్రి ఇంటి ముందు మద్యం తాగుతూ కేకలు వేశారు. పక్కనే ఉన్న నారాయణస్వామి నాయక్ వచ్చి నిద్రభంగం కలిగిస్తున్నారంటూ మందలించి వెళ్లాడు. పక్కనే ఉన్న సుంకమ్మ కూడా వచ్చి మందలించగా.. నెట్టప్పనాయక్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆయన తమ్ముడు సుధాకర్ నాయక్ కూడా వచ్చి ఆమైపె దాడి చేశాడు. దీంతో సుంకమ్మ పోలీసులను ఆశ్రయించింది. నెట్టప్పనాయక్, సుధాకర్ నాయక్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసులకు గొడవలో గోపాల్ నాయక్ కూడా ఉన్నట్లు తెలియడంతో.. బుధవారం ఉదయాన్నే స్టేషన్‌కు రావాలంటూ ఆయనను ఆదేశించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోపాల్ నాయక్ ఇరుగు పొరుగు వారిని తిట్టడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే నారాయణ స్వామి నాయక్ కలుగజేసుకొని వాగ్వాదానికి దిగాడు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో గోపాల్ నాయక్, అతడి భార్య ఉషతోపాటు నారాయణ స్వామి నాయక్‌కు గాయాలయ్యాయి. అందరూ ఆస్పత్రిలో చేరారు. రూరల్ ఎస్‌ఐ సురేష్ విచారిస్తున్నారు.
గాయపడిన గోపాల్ నాయక్, ఉష, నారాయణస్వామి నాయక్

