
ప్రొఫెసర్ కృష్ణకుమారి
అనంతపురం: ఎస్కేయూ క్యాంపస్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ కృష్ణకుమారి నియమితులియ్యారు. వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు సైన్స్ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రొఫెసర్ ఆర్. జీవన్ కుమార్ గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌గా కృష్ణకుమారిని నియమించారు. ప్రొఫెసర్ కృష్ణకుమారికి ఎస్కేయూ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ కళాశాలలు కలిపి ఒకే కళాశాలగా ఏర్పాటు చేయనున్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న అకడమిక్ సంవత్సరం నుంచి క్యాంపస్‌కు ఒకే ప్రిన్సిపాల్‌ను నియమిస్తారు.
● పాలిమర్ సైన్స్ విభాగాధిపతిగా ఫిజిక్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రాంగోపాల్ నియమితులయ్యారు. పాలిమర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్లందరూ పదవీ విరమణ చేయగా, కేవలం టీచింగ్ అసిస్టెంట్‌లు, అకడమిక్ కన్సెల్టెంట్లు పనిచేస్తున్నారు. దీంతో ఫిజిక్స్ విభాగానికి చెందిన వ్యక్తిని ప్రిన్సిపాల్‌గా నియమించారు.
● రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ నాగరాజు నియమితులయ్యారు. ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నాగరాజుకు ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు.