
సొంతూళ్లకు బయలుదేరుతున్న విద్యార్థినులు
పరీక్షలు ముగిసిన ఆనందంలో విద్యార్థులు
రాప్తాడురూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్) పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 30,413 మంది విద్యార్థులకు గాను 29,668 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 28,602 మందికి గాను 27,948 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,811 మందికి గాను 1,720 మంది హాజరయ్యారు. కాగా ఒకేషనల్ పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ప్రధాన పరీక్షలు సజావుగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కేంద్రంలో హాస్టళ్లు, బంధువు ఇళ్లు, అద్దె గదుల్లో ఉంటున్న విద్యార్థులు పరీక్షలు ముగియగానే ఊళ్లకు బయలుదేరారు. బస్టాండులో అన్ని బస్సులు విద్యార్థులతో కిటకిటలాడాయి.
