
సుమారు 1,235 మంది ఖాతాల్లో రూ.79 కోట్లు జమయ్యాయని డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు తెలిపారు.
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో పని చేసే ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న జెడ్పీ, మండల పరిషత్ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు సుమారు 1,235 మంది ఖాతాల్లో రూ.79 కోట్లు జమయ్యాయని డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు తెలిపారు. 2022 మే నుంచి ఇప్పటి వరకూ పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ నగదు జమ చేయడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సహకారం మరచిపోలేమని పలువురు తెలిపారు.