రాప్తాడురూరల్: అసైన్డ్‌మెంట్ కమిటీ ఆమోదంతో పొందిన సాగు పట్టాలకే విలువ ఉంటుంది. అలా కాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు ఇబ్బడిముబ్బడిగా సాగు పట్టాలు పొందారు. అందులోనూ అనంతపురం రూరల్ మండలంలో విలువైన భూములకు ఎసరు పెట్టారు. మాజీమంత్రి పరిటాల సునీత తన అనుచరులు, కార్యకర్తలు, అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టారు. ఒక్క కొడిమి పొలంలోనే 40.80 ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2013 జూన్‌లో చివరి అసైన్డ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఇవన్నీ కూడా అసైన్డ్‌మెంట్ కమిటీ తర్వాత పట్టాలిచ్చినవే. కమిటీ ఆమోదం లేకుండా పొందిన సాగు పట్టాలను తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూములను అనంతపురం అర్బన్, రూరల్ పరిధిలోని పేదలకు జగనన్న ఇళ్ల కోసం కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వెనక్కు తీసుకుంటున్న భూముల వివరాలు ...
కొడిమి పొలం 98–4 సర్వే నంబర్‌లో 2.50 ఎకరాలు, 98–5లో 1.37 ఎకరాలు, 98–2ఏలో 1.56 ఎకరాలు, 136లో 2.30 ఎకరాలు, 136లో 1.79 ఎకరాలు, 136లో 2.68 ఎకరాలు, 149–2లో 4.34 ఎకరాలు, 149–3లో 3.20 ఎకరాలు, 98–3లో 0.64 ఎకరాలు, 98–5లో 1.37 ఎకరాలు, 98–1లో 2 ఎకరాలు, 136లో 4.37 ఎకరాలు, 136లో 3.93 ఎకరాలు, 98–1లో 1.75 ఎకరాలు, 98–1లో 7 ఎకరాలు కలిపి మొత్తం 40.80 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
పంటలకు మాత్రమే పరిహారం
ఈ మొత్తం భూములకు సంబంధించి ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వరు. అందులో సాగు చేస్తున్న పంటలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటికే హార్టికల్చర్ అధికారులు అంచనాలు తయారు చేశారన్నారు. తహసీల్దార్ శ్రీధరమూర్తి మాట్లాడుతూ అసైన్డ్‌మెంట్ కమిటీ ఆమోదం లేకుండా ఇచ్చిన పట్టాలు చట్టం దృష్టిలో చెల్లవన్నారు. ఇప్పుడు భూములు స్వాధీనం చేసుకుంటున్నామన్నారు.
వాటికి అసైన్డ్‌మెంట్ కమిటీ ఆమోదం లేదు
అనంతపురం మండలం కొడిమి పొలంలోనే 40.80 ఎకరాల గుర్తింపు
ఆ పట్టాలనీ రద్దు చేసి స్థలాలను జగనన్న ఇళ్లకు తీసుకున్న ప్రభుత్వం