
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనితీరు వివాదస్పదంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని మరో సెక్షన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఈఓ భాస్కరరెడ్డి, డిప్యూటీ సీఈఓ జల్లా శ్రీనివాసులు, అకౌంట్స్ ఆఫీసర్ అమృతరాజ్ నివేదించిన నివేదికకు జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ ఆమోద ముద్ర వేశారు. మొత్తం 32 మందికి సెక్షన్లు మారుస్తూ ఉత్వరులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పరిపాలనాధికారులతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, నాల్గో తరగతి ఉద్యోగులూ ఉన్నారు. కాగా, సాధారణ బదిలీల అనంతరం ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది ఉద్యోగులు బదిలీపై జెడ్పీకి వచ్చారు. అయితే కొందరు ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేకపోవడంతో వారిపై చైర్‌పర్సన్ గిరిజమ్మతో పాటు ముఖ్య అధికారులు అసంతృప్తితో ఉండేవారు. ప్రస్తుతం పనితీరు ఆధారంగా సెక్షన్లు మార్పు, సీట్ల కేటాయింపు చేయడంతో త్వరలో అన్ని సెక్షన్ల ఉద్యోగులతో జెడ్పీ చైర్‌పర్సన్ సమావేశం కానున్నట్లు తెలిసింది.
పని తీరు ప్రామాణికంగా సీట్ల కేటాయింపు