విషయం తెలిసిన వెంటనే పోతురెడ్డిపాలెం, పురుషోత్తపురం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై కర్రలు,రాళ్లతో దాడులు చేశారు.బస్సు అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీప పొలాల్లోకి పరుగులు తీశారు.అనంతరం నెమ్మదిగా తెల్లవారుజామున హైవే చేరుకుని,ఆటోల్లో అడ్డురోడ్డుకు వెళ్లారు.అక్కడి నుంచి వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పయనమయ్యారు.


