నీటమునిగిన శ్రీనివాస్‌తో మైరెన్ పోలీసులు
ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని గస్తీ నిర్వహిస్తున్న పెంటకోట మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన మేరకు మైరెన్ ఏఎస్‌ఐ ఎం.కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన చవ్వాకుల శ్రీనివాస్ గురువారం 10వ తరగతి చివరి రోజు పరీక్ష రాసి స్నేహితులతో కలిసి సుమారు 10 మంది రేవు పోలవరం తీరానికి వచ్చారు. వీరిలో నలుగురు స్నేహితులు స్నానం కోసం సముద్రంలోనికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలరావడంతో శ్రీనివాస్ మునిగిపోయాడు. అది గమనించిన మైరెన్ పోలీసులు హెచ్‌ఎస్ పి.అప్పలరాజు, శ్రీను, కానిస్టేబుల్ చినబాబు కలసి సముద్రంలోనికి దిగి శ్రీనివాస్‌ను ఒడ్డుకు చేర్చారు. స్వల్ప అస్వస్థతతో తీరంలో నుంచి బయటపడిన శ్రీనివాస్‌ను చూసి స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో స్వగ్రామానికి పంపారు.


