మునగపాక : మండలంలోని కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు.ఇందుకు సంబందించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. కుంచవానిపాలెం గ్రామానికి చెందిన పుచ్చ పారిపల్లి (38) ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకొని ఇంటికి చేరుకొని రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి పారిపల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేశారు. పారిపల్లి మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.


