గడ్డివాము దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివాము దగ్ధం

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

● కావాలనే నిప్పు పెట్టారని అనుమానాలు ● అధికారులకు వైఎస్సార్‌సీపీ నేత ఫిర్యాదు

నాతవరం : మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ వెంకటరమణకు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదైంది. నాతవరం గ్రామ సమీపంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 336లో సుమారుగా మూడు ఎకరాలు 60 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ పశువులు పాకలు వేసుకుని పాడి పరిశ్రమ నడుపుతున్నారు. గేదెలు, ఆవులు కలిపి 15పైగా పశువులు ఉన్నాయి. పాడి పరిశ్రమ నడుపుతున్న వెంకటరమణ పశువులకు ఏడాది కాలం పాటు మేతకు అవసరమైన ఇటీవల ఆరు ట్రాక్టర్లు ఎండిగడ్డి కొనుగోలు చేసి తన పశువుల మకాం వద్ద నిల్వ చేసుకున్నాడు. ఎప్పటి మాదిరిగా బుధవారం సాయంత్రం వరకూ పశువుల సంరక్షణ చూసి ఇంటికి వచ్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో గడ్డి వాము తగలబడడం చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంకటరమణ వెంటనే పశువుల మకాం వద్దకు వెళ్లి చూసేసరికి పెద్ద మంటలతో గడ్డివాములు కాలిపోతుంది. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసిందన్నారు. సమీపంలో ఉన్న పశువులు పాకలు, పశువులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల పాడి పశువుల మేత కోసం సుమారుగా లక్ష రూపాయలతో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా కాలిపోయిందని బాధితుడు వెంకటమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ నాతవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీలో కీలకంగా పని చేస్తుంటాడు. వెంకటరమణ గడ్డివామును ఎవరో కావాలనే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాధితుడు వెంకటరమణ గురువారం తహసీల్దార్‌ చందనరేఖకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement