కొరమీను చేప పిల్లలు విడుదలకు భూమి పూజ చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు
నాతవరం : చేపల పెంపకానికి ప్రభుత్వం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తుందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం మూడు కొరమీను చేప పిల్లలు పెంపకం యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వెలుగు పథకంలో కొరమీను చేపల పెంపకం కోసం రాయితీపై మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్‌కు రూ.4 లక్షల 41వేలు కాగా అందులో రూ.లక్షా 35వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుకు వ్యవసాయ భూమి, విద్యుత్, బోరు సదుపాయం ఉండాలన్నారు. యూనిట్ ఏర్పాటు చేసేందుకు బ్యాంకు ద్వారా రుణం ఇస్తామన్నారు. కొరమీను ఏడాదికి మూడు విడతలుగా పంట వస్తుందన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కనకరాజు, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కోరుబిల్లి మణి, నాతవరం, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జిలు అపిరెడ్డి మాణిక్యం, సింగంపల్లి సన్యాసిదేముడు తదితరులు పాల్గొన్నారు.


