సోలార్‌ ప్లాంట్‌ పేరుతో భూసేకరణ ఆపాలి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్‌ పేరుతో భూసేకరణ ఆపాలి

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

తుమ్మపాల: సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ పేరుతో భూసేకరణ ఆపాలంటూ చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవుల అగ్రహారం, బైలపూడి, చిన్నగోగాడ గ్రామాల ప్రజలు కలెక్టరేట్‌ గేటు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఆర్‌ దేముడు నాయుడు మాట్లాడుతూ జి. కొత్తపల్లిలో సర్వే నంబరు 166,167లో 40 ఎకరాలు, అడవుల అగ్రహారంలో సర్వే నంబరు 63లో 55 ఎకరాలు, బైలపూడిలో సర్వే నంబరు 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబరు2లో 70 ఎకరాలు మొత్తం 225 ఎకరాలకు సాగు నిమిత్తం 65 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందన్నారు. 320 మంది పేద రైతు కుటుంబాలు తాతలు, తండ్రుల నాటి నుంచి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57.97 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ని నిర్మించనున్నట్లు ప్రకటించిందన్నారు. జీడి, మామిడి, పామాయిల్‌, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు నుంచి భూములు తీసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కోవద్దని, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏ అగ్రహారం సర్పంచ్‌ సలారి గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మాచిరాజు, కన్నబాబు నాగరాజు, చలుగు శ్రీనువాస్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement